కట్నం తెస్తావా? విడాకులిస్తావా?

ఉద్యోగం మానేయాలంటారు.. పుట్టింటి వారితో మాట్లాడొద్దంటారు.. విడాకులిస్తావా లేక నిందలు వేయమంటావా ..? అంటూ భార్యను కట్నం కోసం వేధించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు, అతని బంధువులపై కృష్ణా జిల్లా

Updated : 28 Jan 2020 07:35 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: ఉద్యోగం మానేయాలంటారు.. పుట్టింటి వారితో మాట్లాడొద్దంటారు.. విడాకులిస్తావా లేక నిందలు వేయమంటావా ..? అంటూ భార్యను కట్నం కోసం వేధించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు, అతని బంధువులపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం ప్రకారం. కానూరుకు చెందిన పొర్లికొండ నాగ వెంకట హైందవి, హైదరాబాద్‌కు చెందిన మిరదొడ్ల రఘురామ్‌కు ఐదేళ్ల కిందట వివాహమైంది. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. మూడెకరాల పొలం, రూ.10 లక్షల నగదు, 28 తులాల బంగారం కట్నంగా ముట్టజెప్పారు. హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. కొన్నాళ్ల తర్వాత అదనపు కట్నం తేవాలంటూ భర్త, బంధువులు ఈమెను నిత్యం వేధించేవారు. ఉద్యోగం మానేయాలని, పుట్టింటి వారితో మాట్లాడొద్దని, పిల్లలు పుట్టడం లేదంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల వీరి అదనపు కట్నం తేకపోతే నీతో పాటు నీ పుట్టింటి వారిపైనా నిందలు వేసి అభాసుపాల్జేస్తామంటూ హెచ్చరికలు చేయడం ప్రారంభించారు. ఇటీవల ఈమెను బెదిరించి విడాకుల పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. దీంతో ఈమె పుట్టింటికి చేరుకుని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్త రఘురామ్‌, అత్త శుభవాణి, మామ సుబ్రహ్మణ్యం, ఆడపడుచు హారిక, ఈమె భర్త గోవర్ధనరావులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని