యువతిపై పోలీసుల అనుచిత ప్రవర్తన

యువతిపై అనుచిత ప్రవర్తన ఆరోపణలతో గుంటూరు అరండల్‌పేట ఎస్సై బాలకృష్ణ, కానిస్టేబుల్‌ రామును ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఓ యువకుడు మోసం చేశాడని ఫిర్యాదు చేసిన తనతోపాటు, తన తల్లిపై అనుచితంగా ప్రవర్తించారంటూ యువతి

Published : 31 Jan 2020 01:39 IST

ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

గుంటూరు: యువతిపై అనుచిత ప్రవర్తన ఆరోపణలతో గుంటూరు అరండల్‌పేట ఎస్సై బాలకృష్ణ, కానిస్టేబుల్‌ రామును ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఓ యువకుడు మోసం చేశాడని ఫిర్యాదు చేసిన తనతోపాటు, తన తల్లిపై అనుచితంగా ప్రవర్తించారంటూ యువతి ఆరోపించింది. గత నెల 31న ఎస్సై బలాత్కారం చేశారంటూ హోంమంత్రి, ఎస్పీ కార్యాలయాలను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గుంటూరు డీఎస్పీ సుప్రజకు బదిలీ చేశారు.  విచారణ చేపట్టిన అధికారులు తాజాగా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం వారిని సస్పెండ్‌ చేస్తూ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌ వివరాలను గుంటూరు అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌తో పాటు చట్టవిరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణపై మరో కానిస్టేబుల్‌ హనుమంతరావును కూడా విధుల నుంచి బహిష్కరించినట్లు ఎస్పీ తెలిపారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని