సమత హత్యోదంతం తీర్పుపై ఉత్కంఠ

సమత హత్యోదంతం కేసులో తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.ఆదిలాబాద్‌  ప్రత్యేక కోర్టు మరికాసేపట్లో తీర్పు వెల్లడించనుంది. నిందితులను పోలీసులు...

Published : 30 Jan 2020 12:46 IST

ఆదిలాబాద్: సమత హత్యోదంతం కేసులో తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.ఆదిలాబాద్‌  ప్రత్యేక కోర్టు మరికాసేపట్లో తీర్పు వెల్లడించనుంది. నిందితులను పోలీసులు ప్రత్యేక వాహనంలో తెచ్చి కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు సమత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోర్టుకు చేరుకున్నారు. ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ న్యాయవాదులు కోర్టు హాలుకు వచ్చారు. 

తీర్పు నేపథ్యంలో ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గత నవంబర్‌ 24న కుమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌ గ్రామం సమీపంలో సమతపై నిందితులు షేక్‌బాబు, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ మక్దూం సామూహిక హత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ కేసు విచారణకు డిసెంబర్‌ 11న ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని