కొడుకుతో పెళ్లని... మామ అఘాయిత్యం

కొడుకునిచ్చి పెళ్లి చేయవలసిన యువతిపైనే ఒక వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన దిగ్ర్భాంతికర సంఘటన తమిళనాడులో

Published : 01 Feb 2020 01:03 IST

వేదారణ్యం (తమిళనాడు): కొడుకునిచ్చి పెళ్లి చేయవలసిన యువతిపైనే ఒక వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన దిగ్ర్భాంతికర సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. నాగపట్టిణం పోలీసుల కథనం ప్రకారం... నిత్యానందం అనే వ్యక్తి వేదారణ్యంలో బట్టల దుకాణం నడుపుతున్నాడు. ఆయన కుమారుడు ఎన్‌.ముకేశ్‌ కన్నన్‌, ఒక యువతి (20) ప్రేమించుకున్నారు. ఇది నచ్చని నిత్యానందం వారిని ఎలాగైనా విడదీయాలని నిర్ణయించుకున్నాడు. కొడుకు ప్రేమించిన యువతికి వివాహాన్ని గురించి మాట్లాడటానికి తనను కలవమని చెప్పాడు. ఈ యువతి ఇంటికి రాగానే ఆమె ఫోన్‌ను లాక్కున్నాడు. ఆ వెంటనే ఒక మంగళసూత్రాన్ని ఆమె మెడలో కట్టి అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. రెండురోజుల పాటు ఆమెను తన ఇంట్లో నిర్బంధించి లైంగిక దాడి చేశాడు. ఆపై ఆమెను తన స్నేహితుడి ఇంట్లో దాచి ఉంచాడు. జరిగిన సంఘటనను గురించి తెలుసుకున్న కన్నన్‌ బాధితురాలిని రక్షించాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగపట్టిణం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు విచారిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts