లోయలో పడిన బస్సు...ఏడుగురి మృతి

అస్సాంలోని గోల్‌పారా జిల్లా రాంగ్‌జులీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు....

Published : 05 Feb 2020 00:47 IST

గువహటి: అసోంలోనని గోల్‌పారా జిల్లా రాంగ్‌జులీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దుబ్రీ నుంచి గువహటి వెళుతున్న బస్సు రాంగ్‌జులీ ప్రాంతానికి చేరుకుంటున్న సమయంలో డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్థంభాన్ని ఢీకొని పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద ఘటన గురించి తెలుసుకొన్న వెంటనే స్థానికులు, పోలీసులు, భారత ఆర్మీ బృందం అక్కడి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన గురించి అస్సాం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని