ఉగ్రవాది టుండా కేసు తీర్పు వాయిదా

ఉగ్రవాది అబ్దుల్‌ కరీం టుండా కేసు తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈ కేసు తీర్పును ఈనెల 18కి వాయిదా వేస్తూ నాంపల్లి న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని హుమయూన్‌నగర్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, సీసీఎస్‌లో పేలుళ్లకు...

Updated : 04 Feb 2020 18:26 IST

హైదరాబాద్‌: ఉగ్రవాది అబ్దుల్‌ కరీం టుండా కేసు తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈ కేసు తీర్పును ఈనెల 18కి వాయిదా వేస్తూ నాంపల్లి న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని హుమయూన్‌నగర్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, సీసీఎస్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో టుండా నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుపై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. గతనెల 21వ తేదీనే తీర్పు వెల్లడించాల్సి ఉండగా అది నేటికి వాయిదా పడింది. అయితే ఈ తీర్పును నాంపల్లి న్యాయస్థానం మరోసారి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్లకు పాల్పడినట్లు టుండా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.

లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలో కీలకంగా ఉన్న టుండా.. బాంబుల తయారీ, పేలుళ్లలో నిష్ణాతుడిగా పేరు పొందాడు. 1992 బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత 1993లో ముంబయిలో జరిగిన వరుస పేలుళ్లలోనూ టుండా నిందితుడిగా ఉన్నాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడు. అక్కడనుంచే ఐఎస్ఐ, పలు ఉగ్రవాద సంస్థలతోనూ సంబంధాలు పెట్టుకున్నాడు. 2008లో ముంబయిపై జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్.. పాకిస్థాన్‌కు ఇచ్చిన 20 మంది ఉగ్రవాదుల జాబితాలోనూ టుండా పేరుంది. 2013 ఆగస్టులో భారత్-నేపాల్ సరిహద్దులో టుండాను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి టుండాపై 40కి పైగా పేలుళ్లకు సంబంధించిన కేసులున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని