డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరిట మోసం

డబుల్‌ బెడ్‌ ఇళ్లను ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయ్యింది. నకిలీ పత్రాలతో వసూళ్లకు పాల్పడుతున్న ఆరుగురిని దుండిగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1.11 కోట్లు రికవరీ చేశామని...

Published : 09 Feb 2020 00:58 IST

ఆరుగురిని అరెస్ట్‌ చేసిన దుండిగల్‌ పోలీసులు

హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌ ఇళ్లను ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయ్యింది. నకిలీ పత్రాలతో వసూళ్లకు పాల్పడుతున్న ఆరుగురిని దుండిగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1.11 కోట్లు రికవరీ చేశామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. తప్పుడు పత్రాలతో మోసం చేస్తున్న ఈ ముఠాను దుండిగల్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. వెంకట వరప్రసాద్‌ వలశెట్టి ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని, ఇందులో ఆరుగురిని అరెస్ట్‌ చేశామని సజ్జనార్‌ తెలిపారు. మొత్తం 169 మంది నుంచి డబ్బులు వసూలు చేశారని చెప్పారు. మొత్తం రూ.2 కోట్ల మేర వసూలు చేశారని, రూ.1.11 కోట్లు రికవరీ చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, ప్రభుత్వ ఇల్లు ఇప్పిస్తానంటూ వచ్చే దళారులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని