పంజాబ్‌లో పేలుడు.. 15 మంది మృతి

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని తర్న్‌ తరన్‌ జిల్లాలో జరుగుతోన్న మతపరమైన ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. బాణసంచా ఉంచిన ట్రాక్టర్‌లో పొరపాటున నిప్పురవ్వలు పడి పేలుడు సంభవించింది. దీంతో ఊరేగింపులో పాల్గొన భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో

Published : 09 Feb 2020 00:58 IST

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని తర్న్‌ తరన్‌ జిల్లాలో జరుగుతోన్న మతపరమైన ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. బాణసంచా ఉంచిన ట్రాక్టర్‌లో పొరపాటున నిప్పురవ్వలు పడి పేలుడు సంభవించింది. దీంతో ఊరేగింపులో పాల్గొన్న భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్‌ తునాతునకలైపోయింది. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పంజాబ్‌ ఎస్‌ఎస్‌పీ ధ్రువ్‌ దహియా తెలిపారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 18-19 మధ్య వయస్కులేనని ఆయన వెల్లడించారు. తర్న్‌ తరన్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నగర్‌ కీర్తన్‌ ఊరేగింపు సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచాను ట్రాక్టర్‌లో తీసుకొచ్చారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని