Published : 12 Feb 2020 00:40 IST

ప్రయాణికురాలిని బెదిరించి..ఆపై అత్యాచారం!

పోలీసుల పేరుతో ఘోరానికి పాల్పడిన దుండగులు 
జహీరాబాద్‌ పోలీసులకు మహిళ ఫిర్యాదు

జహీరాబాద్‌ అర్బన్‌: పోలీసులమంటూ బస్సులో మహిళా ప్రయాణికురాలిని బెదిరించి ఆపై అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు జహీరాబాద్‌ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటకు చెందిన మహిళ (37) తన పన్నెండేళ్ల కుమారుడితో కలిసి కర్ణాటకలోని బీదర్‌ నుంచి హైదరాబాద్‌కు బస్సులో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో జహీరాబాద్‌ పస్తాపూర్‌ కూడలి వద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు లగేజీలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉన్నాయని.. తనిఖీ చేయాలంటూ ఆ మహిళను కిందికి దింపారు. లగేజీని పరిశీలిస్తూ ఇద్దరు వ్యక్తులు మహిళ కుమారుడిని తమ వద్ద ఉంచుకోగా.. మరో వ్యక్తి మాట్లాడాలంటూ మహిళను సమీపంలోని ఎస్‌బీఐ వెనుకవైపున ఉన్న పాడుపడిన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ సదరు వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మహిళ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు ఘటనాస్థలాన్ని జహీరాబాద్‌ సీఐ సైదేశ్వర్‌, ఎస్సై వెంకటేశ్‌ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని