Updated : 13/02/2020 09:58 IST

మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య

మాదాపూర్‌ : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ యువతి హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ హారిక తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా గంజాంలోని స్వప్నేశ్వర్‌ ప్రాంతానికి చెందిన రాజ్యలక్ష్మి (25) కొంతకాలం కిత్రం మాదాపూర్‌ ప్రాంతానికి వలస వచ్చింది. జూబ్లీహిల్స్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ గుట్టల బేగంపేటలోని సిద్ధివినాయక ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉండేది. మంగళవారం మధ్యాహ్నం హాస్టల్‌లోని తోటి రూమ్‌మేట్స్‌ తమ విధుల నిమిత్తం వెళ్లిపోగా రాజ్యలక్ష్మి గదిలోనే ఉండిపోయింది. రాత్రి 12.30 ప్రాంతంలో రూమ్‌మేట్‌ నవీన హాస్టల్‌ గదికి వచ్చి చూడగా రాజ్యలక్ష్మి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమె హాస్టల్‌ నిర్వాహకులకు, మాదాపూర్‌ పోలీసులకు సమాచారం అందించింది. రాజ్యలక్ష్మి ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని