హంతకుడి నుంచి డాక్టర్‌ దాకా..!

డాక్టర్ కావాలనేది అతని ఆశయం..దానికి తగ్గట్లుగానే ఎంబీబీస్‌ సీటు సాధించాడు..కానీ, అనుకోకుండా హంతకుడిగా మారాడు..చేసిన తప్పుకి 14ఏళ్ల జైలు జీవితం అనుభవించాడు.

Published : 16 Feb 2020 00:40 IST

14ఏళ్ల జైలు శిక్ష అనంతరం డాక్టర్‌ పట్టా..!

డాక్టర్ కావాలనేది అతని ఆశయం.. దానికి తగ్గట్లుగానే ఎంబీబీస్‌ సీటు సాధించాడు.. కానీ, అనుకోకుండా హంతకుడిగా మారాడు.. చేసిన తప్పుకి 14ఏళ్ల జైలు జీవితం అనుభవించాడు. అయినప్పటికీ..జీవిత ఆశయాన్ని మాత్రం మార్చుకోలేదు. తన జీవితాన్ని ఎక్కడ పోగుట్టుకున్నాడో తిరిగి అక్కడి నుంచే ప్రారంభించాడు.

కర్ణాటక కాలాబురగికి చెందిన సుభాష్‌ పాటిల్‌ 1997లో ఎంబీబీఎస్‌లో చేరాడు. ఆ సమయంలో తన ఇంటికి సమీపంలో ఉండే పద్మావతి అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. అప్పటికే పెళ్లయిన ఆమె భర్తకు ఈ విషయం తెలిసి బెదిరించడంతో...సుభాష్, పద్మావతి కలిసి ఆమె భర్తను హత్యచేశారు. ఈ కేసులో సుభాష్‌ పాటిల్‌, పద్మావతిలు దోషులుగా తేలడంతో 2002లో వారికి జీవిత ఖైదు ఖరారుచేసింది న్యాయస్థానం. అప్పటికే ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్న సుభాష్‌ చదువు అక్కడితో ఆగిపోయింది.

అయితే, 14 ఏళ్ల జైలు జీవితం గడిపిన సుభాష్‌, సత్ప్రవర్తన కారణంగా 2016లో విడుదలయ్యాడు. బయటకు వచ్చిన సుభాష్ డాక్టర్‌ కావాలన్న తన ఆశయాన్ని మాత్రం మరవలేదు. ఎలాగైనా ఎంబీబీఎస్‌ పూర్తిచేయాలని నిశ్చయించుకున్నాడు. దీనికోసం తాను మధ్యలో వదిలేసిన ఎంబీబీఎస్‌ కొనసాగిస్తానని సదరు యూనివర్సిటీకి విన్నవించుకున్నాడు.అతని అభ్యర్థనను మన్నించిన విశ్వవిద్యాలయం... న్యాయసలహా అనంతరం చదువును కొనసాగించేందుకు అంగీకరించింది. దీంతో 2016లో తిరిగి చేరిన సుభాష్‌ 2019లో ఎంబీబీఎస్‌.. తాజాగా ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్తి చేసుకున్నాడు. పూర్తిస్థాయి వైద్యుడిగా సేవలు అందించేందుకు సిద్దమయ్యాడు. తప్పు చేసి శిక్ష అనుభవించినప్పటికీ..తన ఆశయాన్ని సాధించుకున్న సుభాష్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని