దిల్లీ హింస.. 22కి చేరిన మృతులు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై  ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 22కి చేరింది. సోమవారం నలుగురు చనిపోగా..

Updated : 27 Feb 2020 00:54 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై  ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 22కి చేరింది. సోమవారం నలుగురు చనిపోగా.. మంగవారం నాటికి ఆ సంఖ్య 13కి చేరింది. బుధవారం నాటికి మృత్యువాత పడిన వారి సంఖ్య 22కి చేరినట్లు గురు తేజ్‌ బహుదూర్‌ (జీటీబీ) ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సునీల్‌ కుమార్‌ గౌతమ్‌ తెలిపారు.

ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న హింసపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా దిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, 1984 అల్లర్ల వంటి ఘటనలు పునరావృతం అవ్వడానికి తాము అంగీకరించబోమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ప్రతి పౌరుడికీ జెడ్‌ కేటగిరి భద్రత కల్పించాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొంది. దిల్లీ ప్రజలంతా శాంతి, సోదరభావాన్ని పాటించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఇవీ చదవండి..

దిల్లీ ప్రజలు సోదరభావాన్ని పాటించాలి:మోదీ

1984లాంటి ఘటనలు పునరావృతం కానివ్వం

 


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని