వరుని వక్రబుద్ధి

చేసుకున్న వివాహ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారన్న కక్షతో యువతిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ బీబీ.రవికుమార్‌ అవనిగడ్డ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అవనిగడ్డ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యువతితో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన విజయభాస్కర్‌తో ఇటీవల వివాహ నిశ్చితార్థమైంది.

Updated : 27 Feb 2020 13:53 IST

నిశ్చితార్థం రద్దు చేసుకున్నారన్న కక్షతో అసభ్య పోస్టులు

యువతి ఫిర్యాదుతో అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న సీఐ రవికుమార్‌, ఎస్‌ఐలు, వెనుక నిందితుడు (ముసుగులో)

అవనిగడ్డ: చేసుకున్న వివాహ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారన్న కక్షతో యువతిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ బీబీ.రవికుమార్‌ అవనిగడ్డ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అవనిగడ్డ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యువతితో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన విజయభాస్కర్‌తో ఇటీవల వివాహ నిశ్చితార్థమైంది. అనంతరం కాబోయే భర్తతో ఆమె చనువుగా ఉంటున్న దానిని ఆసరా చేసుకొని యువతి పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించేవాడు. అసభ్య చిత్రాలను చిత్రీకరించాడు. తన అవసరాలు తీర్చమని ఒత్తిడి తెచ్చాడు. ఈ నేపథ్యంలో అతని ప్రవర్తన బాగుండ లేదని యువతి తల్లిదండ్రులు గమనించి చేసుకున్న నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో కక్ష కట్టిన నిందితుడు ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన చిత్రాలతో అప్పటికే ఆమె పేరుతో తెరిచిన ఫేస్‌బుక్‌లో అసభ్య పోస్టులు పెడుతున్నాడు. ఆమె పేరుతో క్రియేట్‌ చేసిన మెయిల్‌ ద్వారా ఆమె పరిచయస్థులకు చిత్రాలను పంపుతున్నాడు. దీంతో తల్లిదండ్రులతో కలిసి యువతి ఈనెల 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడు విజయభాస్కర్‌ను గుర్తించి బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు. నిందితుడిని సైబర్‌ సెక్షన్ల కింద అరెస్టు చేసి, అసభ్యంగా చిత్రీకరించిన చిత్రాలను, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు సందీప్‌, సురేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని