మారుతీరావు విషం తీసుకున్నారు:సీఐ సైదిరెడ్డి

ఆత్మహత్యకు పాల్పడిన మిర్యాలగూడ వ్యాపారి, ప్రణయ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు పోస్ట్‌మార్టం పూర్తయింది. ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అందజేయడంతో వారు మిర్యాలగూడ .....

Updated : 08 Mar 2020 18:52 IST

హైదరాబాద్‌: ఆత్మహత్యకు పాల్పడిన మిర్యాలగూడ వ్యాపారి, ప్రణయ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు పోస్ట్‌మార్టం పూర్తయింది. ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అందజేయడంతో వారు మిర్యాలగూడ తరలించారు. ఈ సందర్భంగా సైఫాబాద్‌ సీఐ సైదిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మారుతీరావు విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని చెప్పారు. ఘటన గురించి తెలిసిన తర్వాత ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో క్లూస్‌ టీంతో తనిఖీలు చేయించామన్నారు. ఆ సమయంలో మారుతీరావు మంచంపై విగతజీవిగా పడి ఉన్నారని చెప్పారు. ఘటనాస్థలంలో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నామని.. ఆ లేఖలో ‘గిరిజా క్షమించు, అమృతా అమ్మదగ్గరికి రా’ అని ఉందని సీఐ వివరించారు. ప్రణయ్‌ హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బనాయించిన కేసుల ఒత్తిడి కారణంగానే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

ఇదీ చదవండి..

మారుతీరావు ఆత్మహత్య

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని