ఉన్నావ్‌ నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసులో దిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో కులదీప్‌ సెంగార్‌తో పాటు మరో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ పదేళ్ల జైలు....

Published : 14 Mar 2020 00:48 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసులో దిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో కులదీప్‌ సెంగార్‌తో పాటు మరో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ పదేళ్ల జైలు శిక్ష విధించింది. సెంగార్‌తో పాటు ఆయన సోదరుడు అతుల్‌ సెంగార్‌ను రూ.10లక్షలు చొప్పున బాధితురాలి కుటుంబానికి చెల్లించాలని న్యాయమూర్తి ధర్మేష్‌ శర్మ ఆదేశించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన ఓ మైనర్ యువతిపై 2017లో అత్యాచారం చేసిన కేసులో కులదీప్‌ సెంగార్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో ఉండగా పోలీస్‌ కస్టడీలో బాధితురాలి తండ్రి 2018 ఏప్రిల్ 9న మృతి చెందాడు. ఈ ఘటనలో సెంగార్‌, ఆయన సోదరుడు, ఇద్దరు పోలీసు అధికారులు సహా మొత్తం ఏడుగురిని మార్చి 4న కోర్టు దోషులుగా తేల్చింది. తాజాగా దోషులకు శిక్షలు ఖరారు చేసింది.

ఉన్నావ్‌ అత్యాచారం కేసు ఇప్పటి వరకు ఎన్నో మలుపులు తిరిగింది. 2018లో ఓ కేసులో అరెస్టయిన తండ్రి కస్టడీలో మరణించాడు. దీంతో పాటు ఉన్నావ్‌ బాధితురాలు సహా ఆమె కుటుంబ సభ్యులు కారులో వెళుతుండగా వారిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో కుటుంబ సభ్యులను సైతం బాధితురాలు కోల్పోయింది. ఆమె ప్రస్తుతం సీఆర్పీఎఫ్‌ సంరక్షణలో ఉంటోంది. గతేడాది డిసెంబర్‌ 20న అత్యాచారం కేసులో సెంగార్‌కు దిల్లీ కోర్టు జైలు శిక్ష విధించింది.

ఇదీ చదవండి..

‘నా తప్పుంటే కళ్లలో యాసిడ్‌ పోయండి’


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts