టాయ్‌లెట్‌కు వెళ్లొచ్చేలోగా BMW మాయం!

అసలే అది బీఎండబ్ల్యూ లగ్జరీ కారు. యజమాని టాయ్‌లెట్‌ కోసమని కారు దిగాడు. ఇంకేముంది ఆ కాస్త సందులోనే తమ చేతికి పని చెప్పి.. కారుతో పరారయ్యారు కొందరు ఘరానా దొంగలు.

Published : 16 Mar 2020 00:55 IST

నోయిడా: అసలే అది బీఎండబ్ల్యూ లగ్జరీ కారు. యజమాని టాయ్‌లెట్‌ కోసమని కారు దిగాడు. ఇంకేముంది ఆ కాస్త సందులోనే తమ చేతికి పని చెప్పి.. కారుతో పరారయ్యారు కొందరు ఘరానా దొంగలు. ఈ ఘటన యూపీలోని నోయిడాలో చోటుచేసుకుంది. డీసీపీ హరీష్‌ చందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రిషభ్‌ అరోరా అనే వ్యక్తి స్టాక్‌ బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి బీఎండబ్ల్యూ లగ్జరీ కారు ఉంది. దానిపై ఇంకా రూ.40లక్షల రుణం పెండింగ్‌లో ఉంది. కాగా శనివారం అర్ధరాత్రి అతడు ఓ విందుకు హాజరై తిరిగి వస్తుండగా టాయ్‌లెట్‌ కోసమని సెక్టార్ 90 ప్రాంతంలో రోడ్డుపై కారును ఆపాడు. ఈ క్రమంలో అది గమనించిన కొందరు దుండగులు ఆ కాస్త సమయంలోనే అతడి బీఎండబ్ల్యూ కారును ఎత్తుకువెళ్లారు. వెంటనే షాకైన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు త్వరలోనే కారును అప్పగిస్తామని అతడికి హామీ ఇచ్చారు. దొంగిలించిన వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని