ఆ విషయం దాస్తారా.. స్టేషన్‌కు పదండి!

మహారాష్ట్రలో విదేశీ పర్యటనకు వెళ్లొచ్చిన ఇద్దరు దంపతులు వివాదంలో చిక్కుకున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన విషయాన్ని దాచినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేయడంతో షాక్‌కు గురయ్యారు.

Published : 22 Mar 2020 01:50 IST

ముంబయి: మహారాష్ట్రలో విదేశీ పర్యటనకు వెళ్లొచ్చిన ఇద్దరు దంపతులు వివాదంలో చిక్కుకున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన విషయాన్ని దాచినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేయడంతో షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ అమల్నర్‌లో జరిగింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎవరైనా విదేశాలకు వెళ్లి వస్తే.. అధికారులను సంప్రదించి సంబంధిత జాగ్రత్తలు పాటించమని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. లక్షణాలు ఉన్నా లేకపోయినా క్వారంటైన్‌లో ఉండమని సూచించింది. కానీ ఆ దంపతులు థాయ్‌లాండ్‌కు వెళ్లి వచ్చిన విషయాన్ని దాచి పుణెలో తమ కుమారుడి వద్దకు వెళ్లి వచ్చినట్లు చెప్పారు. కానీ పోలీసులు తాజాగా డేటా ట్రాకింగ్‌ చేయగా వారు విదేశీ పర్యటన నుంచి వచ్చినట్లు తేలడంతో వారిపై కేసు నమోదు చేశారు.  

అమల్నర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ అధికారి మాట్లాడుతూ.. ‘గజానన్‌ నగర్‌లో ఉండే దంపతుల్ని విదేశాలకు వెళ్లి వచ్చారా లేదా అని ఇటీవల ఆరా తీయగా వారు లేదని చెప్పారు. పుణెలో తమ కుమారుడి వద్దకు వెళ్లినట్లు చెప్పారు. ట్రాకింగ్‌ విచారణలో వారు థాయ్‌లాండ్‌కు వెళ్లినట్లు తేలింది. దీంతో వారిపై (ఎపిడమిక్‌ డిసీజ్‌ కంట్రోల్‌ చట్టం 1897) కింద కేసు నమోదు చేశాం’ అని తెలిపారు. ప్రస్తుతం వారిని క్వారంటైన్‌లో ఉంచామని.. వారి నమూనాల్ని పరీక్షలకు పంపినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని