Published : 28 Mar 2020 01:08 IST

పెట్రోలు పోసుకొని దంపతుల ఆత్మహత్య

రాజమహేంద్రవరం నేరవార్తలు: అనారోగ్య కారణాలు.. సంతానం కలగకపోవడం తదితర కారణాలతో తీవ్ర మనస్తాపం చెందిన దంపతులు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులోని బాబానగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే ప్రాంతానికి చెందిన రాజమండ్రి సతీశ్‌(40), వీరవెంకటలక్ష్మి(30) దంపతులు. సతీశ్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వివాహం జరిగి పదేళ్లకు పైగా అయినా వీరికి సంతానం లేదు. దీని కోసం స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నారు. దీంతో పాటు ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలు రావడం, భార్యకు సైతం కిడ్నీ సమస్య తలెత్తడం.. సంతానం లేదనే వేదనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం స్థానికంగా ఉన్న ఓ ఖాళీస్థలంలో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానిక ప్రకాశ్‌నగర్‌ పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో ‘తమ చావుకు ఎవరూ కారణం కాదు’ అని రాసి ఉన్న నోట్‌తో పాటు వైద్య పరీక్షలకు సంబంధించిన పత్రాలను పోలీసులు గుర్తించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts