కేవైసీ పేరుతో రూ. 1.90 లక్షలు మాయం

పేటీఎం కేవైసీ పేరుతో ఇద్దరి ఖాతాల్లో నుంచి రూ.1.90 లక్షలు మాయం చేశారు సైబర్‌ నేరస్థులు. లక్డీకాపూల్‌కు చెందిన ఓ వ్యక్తికి పేటీఎం కేవైసీ...

Updated : 29 Mar 2020 13:04 IST

హైదరాబాద్‌: పేటీఎం కేవైసీ పేరుతో ఇద్దరి ఖాతాల్లో నుంచి రూ.1.90 లక్షలు మాయం చేశారు సైబర్‌ నేరస్థులు. లక్డీకాపూల్‌కు చెందిన ఓ వ్యక్తికి పేటీఎం కేవైసీ చేసుకోవాలంటూ ఫోన్‌ వచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో క్విక్‌ సపోర్టు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేస్తే ప్రక్రియ పూర్తి చేస్తామని ఆ వ్యక్తి చెప్పడంతో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేశాడు. అనంతరం ఖాతాలో నుంచి రూ.96 వేలు మళ్లించినట్లు సమాచారం వచ్చింది. వారాసిగూడకు చెందిన వ్యక్తి ఖాతాలో నుంచి ఇదే తరహాలో రూ.94 వేలు మాయమయ్యాయి. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని