OLXలో ఐక్యతా విగ్రహం అమ్మకానికి అంటూ.. 

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశానికి చెందిన ఐక్యతా విగ్రహాన్ని (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ) కొందరు ప్రబుద్దులు అమ్మకానికి పెట్టారు.

Updated : 06 Apr 2020 14:56 IST

కరోనా నివారణకు నిధులు కావాలంటూ ఆకతాయిల ప్రకటన

వడోదర: కరోనా కట్టడి కోసం ఓ వైపు అధికార యంత్రాంగం నిరంతం శ్రమిస్తుంటే.. మరోవైపు ఆకతాయిల చేష్టలు వారిని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. కరోనాపై పోరాటానికి నిధుల కోసమంటూ పలువురు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఐక్యతా విగ్రహాన్ని (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ) ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటన ఉంచారు. ఆస్పత్రుల ఏర్పాటు, వైద్య పరికరాల కొనుగోళ్ల కోసం దీన్ని రూ.30,000 కోట్లకు విక్రయిస్తున్నామంటూ ఆకతాయిలు ఆ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన ఐక్యతా విగ్రహం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మోసానికి పాల్పడటం, అంటువ్యాధుల నివారణ చట్టం, ఐటీ చట్టాల కింద నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. కాగా ఈ ప్రకటనను ఓఎల్‌ఎక్స్‌ సంస్థ తమ వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. దీనిపై ట్విటర్‌ ద్వారా క్షమాపణలు కోరింది. ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్మృతి చిహ్నంగా గుజరాత్‌లోని నర్మదా నది తీరంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని