పాల డబ్బాల్లో మద్యం తీసుకెళ్తూ దారి తప్పి..

పాల డబ్బాల్లో మద్యం సీసాలు తీసుకెళ్తూ సోమవారం ఉదయం ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. బులంద్‌షహర్‌కు చెందిన బాబీ చౌదరీ వృత్తిరీత్యా పాల వ్యాపారి. ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్‌ అమవుతున్న సంగతి తెలిసిందే. అత్యవసరం కాని మద్యం దుకాణాలు ఇప్పుడు బంద్‌....

Published : 07 Apr 2020 00:41 IST

దిల్లీ: పాల డబ్బాల్లో మద్యం సీసాలు తీసుకెళ్తూ సోమవారం ఉదయం ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. బులంద్‌షహర్‌కు చెందిన బాబీ చౌదరీ వృత్తిరీత్యా పాల వ్యాపారి. ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్‌ అమవుతున్న సంగతి తెలిసిందే. అత్యవసరం కాని మద్యం దుకాణాలు ఇప్పుడు బంద్‌. ఇలాంటి సమయంలో తన బంధువు పుట్టిన రోజు వేడుక కోసం బాబీ.. ఏడు మద్యం సీసాలను పాల డబ్బాల్లో దాచి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. పోలీసులకు చిక్కాడు.

ఆదివారం రాత్రి 12:05 గంటలకు (తెల్లవారితే సోమవారం) బాబీని సౌత్‌ ఎవెన్యూ రహదారి పికెట్‌ వద్ద పోలీసులు బాబీని చూశారు. రోడ్డుపై నుంచి పాలడబ్బాలతో అర్ధరాత్రి వెళ్తుండటంతో అతడిపై వారికి అనుమానం వచ్చింది. ఆపేందుకు ప్రయత్నించగా బండి వేగం పెంచిన బాబీ ముందుకు వెళ్లిపోయాడు. అతడిని వెంబడించిన పోలీసులు రాష్ట్రపతి భవన్‌ నాలుగో ద్వారం వద్ద పట్టుకున్నారు. అంటువ్యాధుల చట్టం, దిల్లీ ఎక్సైజ్‌ చట్టం, ఐపీసీ, వాహన చట్టం ప్రకారం అతడిపై కేసు నమోదు చేశామని దిల్లీ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ఎయిష్‌ సింఘాల్‌ తెలిపారు. కొసమెరుపు ఏంటంటే.. గుర్గావ్‌ నుంచి మద్యాన్ని బాబీ తీసుకొచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తూ దారి తప్పిపోయాడు. దిల్లీ రోడ్లపై తిరుగుతూ పోలీసులకు చిక్కాడని దర్యాప్తులో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని