సూట్‌కేస్‌లో యువకుడిని పెట్టి..

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ అమలుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్న సంగంతి తెలిసిందే. అయితే కొందరి దుందుడుకు చర్యలు పోలీసులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. తాజా కర్ణాటకలో ఓ యువకుడు చేసిన ......

Published : 13 Apr 2020 00:32 IST

మంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ అమలుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొందరి దుందుడుకు చర్యలు పోలీసులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా కర్ణాటకలో ఓ యువకుడు చేసిన పని స్థానికులతో పాటు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. మంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ అపార్ట్‌మెంట్‌వాసులు బయటి వ్యక్తులను లోపలికి అనుమతించడంలేదు. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే ఓ యువకుడు తన స్నేహితుణ్ని బయటి నుంచి తీసుకురావడానికి అపార్ట్‌మెంట్‌వాసులు అనుమతించకపోవడంతో అసహనానికి గురయ్యాడు. దీంతో ఒక పెద్ద సూట్‌కేస్‌లో తన స్నేహితుణ్ని ఉంచి లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అనుమానం వచ్చిన అపార్ట్‌మెంట్ వాసులు సూట్‌కేస్ తెరిచి లోపల ఉన్న యువకుణ్ని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం అందివ్వడంతో యువకులను స్టేషన్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని