యువతుల ఆత్మహత్య..పక్కనే చిన్నారి మృతదేహం!

మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. డెంటల్‌ కాలేజీ సమీపంలోని డంపింగ్‌...

Updated : 07 Dec 2022 21:47 IST

జవహర్‌నగర్‌ : మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు ఇద్దరు మహిళలు సహా ఐదేళ్ల చిన్నారిని బలి తీసుకున్నాయి. రేషన్‌కు వెళ్లి ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చారని భర్తలు అడగటమే వారి పాలిట మృత్యుశాసనమైంది. అభం శుభం తెలియని చిన్నారికి నూరేళ్లు నిండేలా చేసింది. రెండు కుటుంబాల్లో తీరని ఆవేదనను మిగిల్చిన ఈ సామూహిక మరణాలు స్థానికంగా కలకలం రేపాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు..అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి వీరంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

మృతులు అనూష, సుమతి, ఉమామహేశ్వరి 3 రోజుల క్రితం కరీంనగర్‌  జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేటకు వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో తల్లి అనూష, కుమార్తె ఉమామహేశ్వరికి శీతల పానీయంలో రసాయనాలు కలిపి తాగించి అనంతరం చిన్నారి మెడకు చున్నీ బిగించిందని, చిన్నారి చనిపోయిందని నిర్ధారించుకున్నాక మిగిలిన ఇద్దరూ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. శామీర్‌పేట మీదుగా జవహర్‌ నగర్‌ చేరుకున్న వీరికి..స్థానికంగా ఓ చర్చిలో ఆశ్రయం దొరికినట్లు గుర్తించారు.

వెల్గటూరు మండలం అంబారిపేటకు చెందిన సుమతి కుటుంబం జీవనోపాధి కోసం 22 ఏళ్ల క్రితమే కరీంనగర్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో నివాసం ఉంటున్నారు. సుమతి ఏడేళ్ల క్రితం మర్రిపల్లికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి తమ వద్దకు రావడం లేదని, తమతో మాట్లాడటం మానేసిందని, తాము కూడా ఆమె గురించి అంతగా పట్టించుకోలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. భర్త కారు డ్రైవర్‌గా పని చేస్తూ స్థానిక జ్యోతినగర్‌లోని కుర్మవాడ బిల్డింగ్‌లో అద్దెకు ఉంటున్నట్లు తమకు తెలిసిందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని