కరోనా కాలం: దగ్గాడని తుపాకీతో కాల్చేశాడు!

కరోనా వైరస్‌ కాలంలో ఎవరైనా తుమ్మినా, దగ్గినా పక్కనున్న వాళ్లకు కాస్త ఆందోళన కలుగుతోంది! ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు ఉదాహరణ. గ్రేటర్‌ నోయిడాలో లూడో ఆడుతుండగా 25 ఏళ్ల ఓ వ్యక్తి కావాలనే దగ్గుతున్నాడని గొడవపెట్టుకున్న మరొకరు అతడిని తుపాకీతో కాల్చేశాడు.....

Published : 16 Apr 2020 01:12 IST

నోయిడా: కరోనా వైరస్‌ కాలంలో ఎవరైనా తుమ్మినా, దగ్గినా పక్కనున్న వాళ్లకు కాస్త ఆందోళన కలుగుతోంది! ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు ఉదాహరణ. గ్రేటర్‌ నోయిడాలో లూడో ఆడుతుండగా 25 ఏళ్ల ఓ వ్యక్తి కావాలనే దగ్గుతున్నాడని గొడవపెట్టుకున్న మరొకరు అతడిని తుపాకీతో కాల్చేశాడు. జర్చా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దయానగర్‌ ఆలయంలో మంగళవారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన జరిగింది.

ప్రశాంత్‌సింగ్‌ అలియాస్‌ ప్రవేశ్‌ (25), జై వీర్‌సింగ్‌ అలియాస్‌ గుల్లూ (30) దయానగర్‌లో వ్యవసాయం చేస్తారు. మంగళవారం రాత్రి ప్రశాంత్‌ మరో ముగ్గురు కలిసి లూడో ఆడుతున్నారు. అప్పుడే గుల్లూ అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో ప్రవేశ్‌ దగ్గడంతో అతడితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్యా గొడవ ముదరడంతో సహనం కోల్పోయిన గుల్లూ వెంటనే తుపాకీ తీసి అతడిని కాల్చేశాడు. గాయపడ్డ ప్రవేశ్‌ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని