ఇంటికే మద్యం పంపుతామంటూ సైబర్‌ వల

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలన్నీ మూతపడ్డాయి. మద్యం లేకపోవడంతో మందు బాబులు తలలు పీక్కుంటున్నారు. ఈ అవకాశాన్నే క్యాష్‌ చేసుకోవాలని కొందరు సైబర్‌ నేరగాళ్లు వల

Published : 19 Apr 2020 00:52 IST

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలన్నీ మూతపడ్డాయి. మద్యం లేకపోవడంతో మందు బాబులు తలలు పీక్కుంటున్నారు. ఈ అవకాశాన్నే క్యాష్‌ చేసుకోవాలని కొందరు సైబర్‌ నేరగాళ్లు వల విసురుతున్నారు. ఇంటికే మద్యం పంపుతామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇలాగే సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయారు. వివరాల్లోకి వెళ్తే.. మద్యం ఇంటికే పంపిస్తామని చెప్పడంతో.. యాకుత్‌పురా కాలనీకి చెందిన వ్యక్తి రూ.3.27 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించాడు. మెహిదీపట్నానికి చెందిన మరో వ్యక్తి మద్యం కోసం రూ.48 వేలు అడ్వాన్స్‌ చెల్లించాడు. కానీ, మద్యం రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని