మద్యం తరలిస్తున్న హోంగార్డు పట్టివేత

అక్రమంగా మద్యం తరలిస్తున్న హోంగార్డును అదుపులోకి తీసుకున్న సంఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

Published : 20 Apr 2020 05:38 IST

వనస్థలిపురం, న్యూస్‌టుడే: అక్రమంగా మద్యం తరలిస్తున్న హోంగార్డును అదుపులోకి తీసుకున్న సంఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నమ్మికల్‌ గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌ మలక్‌పేట ట్రాఫిక్‌ ఠాణాలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను తన స్వగ్రామం నుంచి కారులో 36 మద్యం సీసాలను తీసుకుని సైదాబాద్‌కు ఆదివారం ఉదయం బయలుదేరాడు. విధులకు హాజరయ్యేందుకు వెళుతున్నట్లుగా యూనిఫాం ధరించాడు. విశ్వసనీయ సమాచారంతో  పోలీసులు వనస్థలిపురం పనామా వద్ద కారులో తనిఖీ చేసి  మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. హోంగార్డును రిమాండ్‌కు తరలించారు.


మరో ఘటనలో కానిస్టేబుల్‌..

మరో ఘటనలో మద్యం తరలిస్తున్న కానిస్టేబుల్‌ను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ వెంకటయ్య కథనం ప్రకారం.. నాంపల్లి ఠాణాలో కానిస్టేబుల్‌గా ఉన్న విజయ్‌(30)  ఈనెల 16న గుంటూరు సమీపంలోని పిడుగురాళ్లకు వెళ్లాడు. 17వ తేదీన రాత్రి నగరానికి కారులో బయలుదేరాడు. నల్గొండలో ఓ వ్యక్తి వద్ద మద్యం కొనుగోలు చేశాడు. మద్యం సీసాలను కారులో పెట్టుకొని నగరానికి వస్తుండగా పనామ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి పట్టుకున్నారు. 23 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని