రైళ్లు రావనుకొని అల్పాహారం తింటుండగా..

రైళ్లు రావనే నిర్లక్ష్యం వారి పాలిట మరణశాసనమైంది. రైల్వే పట్టాలపై కూర్చొని అల్పాహారం తింటున్న ఇద్దరు యువకుల పైనుంచి ఓ గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘఘటన ఛత్తీస్‌గఢ్‌‌లోని కొరియా జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు

Updated : 22 Apr 2020 06:06 IST

గూడ్స్‌ రైలు ఢీకొని ఇద్దరు మృతి

సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి

రాయ్‌పుర్‌: రైళ్లు రావనే నిర్లక్ష్యం వారి పాలిట మరణశాసనమైంది. రైల్వే పట్టాలపై కూర్చొని అల్పాహారం తింటున్న ఇద్దరు యువకుల పైనుంచి ఓ గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘఘటన ఛత్తీస్‌గఢ్‌‌లోని కొరియా జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. దీంతో నలుగురు దినసరి కూలీలు కాలినడకన సూరజ్‌పూర్‌ జిల్లాలోని తమ సొంతూరికి పయనమయ్యారు. ఈ క్రమంలో పెండ్రా జిల్లా నుంచి రైల్వే పట్టాలను అనుసరిస్తూ సోమవారం రాత్రి నుంచి 80 కి.మీ. వరకు ప్రయాణం కొనసాగించి కొరియా జిల్లాకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం మరో ఇద్దరు మంచి నీరు తెచ్చేందుకు వెళ్లగా కాలేశ్వర్‌ రాజ్‌వాడే(21), గులాబ్‌ రాజ్‌వాడే(20) ఉదల్కచ్చర్‌-డర్రిటోల స్టేషన్ల మధ్యలోని రైలు పట్టాలపై కూర్చొని అల్పాహారం తింటున్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన ఓ గూడ్సు రైలు వారిని ఢీకొట్టింది. ఆ ప్రాంతంలో మలుపు ఉండటంతో వారు  రైలును గమనించలేకపోయినట్లు తెలుస్తోంది. మిగతా ఇద్దరు ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ దుర్ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సహాయం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని