భార్యకు కరోనా పాజిటివ్‌..భర్త ఆత్మహత్య

ఒకవైపు భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. మరోవైపు భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. 54 ఏళ్ల సదరు వ్యక్తి గురువారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు...

Published : 02 May 2020 00:30 IST

గురుగ్రామ్‌ (హరియాణా): ఒకవైపు భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. మరోవైపు భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. 54 ఏళ్ల వ్యక్తి గురువారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆయనకు కరోనా సోకిందా లేదా అనేది పోస్ట్‌మార్టానికి ముందు తేలుతుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు