గ్రూప్‌లో అసభ్య చాటింగ్‌, విద్యార్థి అరెస్టు

సంచలనం సృష్టించిన వివాదాస్పద ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూప్‌ వ్యవహారంలో ఓ విద్యార్థిని దిల్లీ సైబర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 07 May 2020 02:09 IST

సహవిద్యార్థినులపై మానభంగం గురించి చర్చలు

దిల్లీ: దేశరాజధానిలో సంచలనం సృష్టించిన వివాదాస్పద ఇన్‌స్టా గ్రూప్‌ వ్యవహారంలో ఓ విద్యార్థిని దిల్లీ సైబర్‌ పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థినులపై అత్యాచారం, తదితర నేరపూర్వక చర్యలను గురించి గ్రూప్‌ చాట్‌లో చర్చించినందుకు ఈ విద్యార్థిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అతని మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, ఆ ఇన్‌స్టాగ్రాం గ్రూపును డీయాక్టివేట్‌ చేశారు. కాగా, ఈ బాలుడు దిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుతున్నాడని తెలిసింది. ఈ గ్రూప్‌ చాట్లో మొత్తం 20 మంది పాల్గొన్నారని, మిగిలిన సభ్యుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఇన్‌స్టా గ్రూపులో మొత్తం 100 మంది సభ్యులున్నట్టు తెలిసింది. దీనిని గురించిన మరిన్ని వివరాలకోసం సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దక్షణ దిల్లీలోని 11, 12 తరగతులకు చెందిన కొందరు విద్యార్థులు ‘బాయిస్‌ లాకర్‌ రూమ్‌’ అనే పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూపును ఏర్పాటుచేసుకున్నారు.  అనుమతి లేకుండా మైనర్‌ విద్యార్థినుల ఫోటోలను తమ గ్రూపులో షేర్‌ చేయటమే కాకుండా, వారిపై అసభ్యకరమైన వ్యాఖ్యలను కూడా చేశారు. ఈ  గ్రూప్‌ సభ్యులు చేసిన చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను కొందరు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వ్యవహారంపై 19 సంవత్సరాల కళాశాల విద్యార్థిని ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని