Published : 15 May 2020 09:55 IST

గమ్యం చేరకుండానే.. చిన్నారి మృతి

చౌటుప్పల్‌ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల పరిధిలోని బొర్రోళ్లగూడెం వద్ద 65వ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 నెలల పసికందు మృతిచెందింది. చిన్నారి  తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. చౌటుప్పల్‌ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా రామవరం మండలం మెట్లవారి తోట గ్రామానికి చెందిన కడలి పెద్దిరాజు కుటుంబం హైదరాబాదులో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోవడంతో పెద్దిరాజు తన భార్య లక్ష్మి, కుమార్తె యజ్ఞశ్రీతో కలిసి ద్విచక్ర వాహనంపై సొంతూరికి బయలుదేరారు. బొర్రోళ్లగూడెం వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.  ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని