Updated : 18 May 2020 06:04 IST

ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆపై ఉరి వేసుకొని

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: కంటికి రెప్పలా చూసుకునే కన్న తల్లే.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం గుంటూరుజిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గన్నవరపు రంగారెడ్డి రెండో కుమార్తె రాధిక (27)కు వెల్దుర్తికి చెందిన లచ్చిరెడ్డితో ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి దీపక్‌రెడ్డి(6), రిషిత(2) సంతానం. లచ్చిరెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. వీరు అతని సోదరుడి కుటుంబంతో కలిసి పక్కపక్కనే నివసిస్తున్నారు. సుమారు 5 నెలల క్రితం తోటికోడలి కుమార్తె ఫినాయిల్‌ తాగి మృతి చెందింది. అప్పటినుంచి నీవే మా పాపను చంపావంటూ తోటికోడలు తరచూ నిలదీస్తుండటంతో రాధిక మనస్తాపానికి గురైంది. భర్త లచ్చిరెడ్డి మూడు రోజుల కిందట రాధిక, ఇద్దరు పిల్లలను తుమ్మలచెరువులో వదిలి వెళ్లారు. మనస్తాపానికి గురైన రాధిక ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరి పిల్లలను దిండుతో ఊపిరాడకుండా చంపి తానూ ఉరేసుకుంది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts