వన్య ప్రాణులపై టిక్‌టాక్‌.. యువకుడి అరెస్టు

వన్య ప్రాణులపై వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్టు చేసిన యువకుడిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. ...

Updated : 22 May 2020 08:37 IST

కళ్యాణదుర్గం, కంబదూరు : వన్య ప్రాణులపై వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్టు చేసిన యువకుడిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. ఆత్మకూరు రేంజ్‌ అటవీశాఖ అధికారులను విచారణకు ఆదేశించారు. కంబదూరు మండలం అయ్యంపల్లి గ్రామ యువకుణ్ని స్థానిక అటవీశాఖ రేంజ్‌ అధికారికి అప్పగించారు. గొర్రెల కాపరి అయిన నాగార్జున జింక పిల్ల పట్టుకొని మేక పాలు తాగిస్తున్న దృశ్యం, కుందేలు మాంసం కుక్కలకు వేస్తున్న దృశ్యాలు టిక్‌టాక్‌లో పోస్టు చేశాడు. ఆ యువకుణ్ని అటవీశాఖ సెక్షన్‌ అధికారి రామచంద్రనాయక్‌కు అప్పగించారు. అతన్ని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు అటవీశాఖ రేంజ్‌ అధికారి రామ్‌సింగ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు