పిల్లికి ఉరేసి టిక్‌టాక్‌ : యువకుడి అరెస్టు

టిక్‌టాక్‌లో లైక్‌ల కోసం ఓ యువకుడు క్రూరంగా ప్రవర్తించాడు. పెంచుకుంటున్న పిల్లికి ఉరివేస్తూ టిక్‌టాక్‌ వీడియో తీయడంతో పోలీసులు అతన్ని అరెస్టు  చేశారు

Published : 23 May 2020 07:30 IST

చెన్నై : టిక్‌టాక్‌లో లైక్‌ల కోసం ఓ యువకుడు క్రూరంగా ప్రవర్తించాడు. పెంచుకుంటున్న పిల్లికి ఉరివేస్తూ టిక్‌టాక్‌ వీడియో తీయడంతో పోలీసులు అతన్ని అరెస్టు  చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా పళవూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని చెట్టికుళానికి చెందిన తంగదురై పశువుల ఫామ్‌లో పని చేస్తున్నాడు. ఈ యువకుడు టిక్‌టాక్‌ యాప్‌ ఎక్కువగా వినియోగిస్తుంటాడని తెలిసింది. ఎక్కువ లైక్‌ల కోసం తన పెంపుడు పిల్లిని ఉరివేసి ఆ దృశ్యాలను టిక్‌టాక్‌ వీడియో తీశాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. దృశ్యాలు వైరల్‌ కావడంతో విషయం తిరునెల్వేలి జంతు హింస నివారణ అధికారులకు సమాచారం అందింది. వాళ్లు దీనిపై పళవూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తంగదురైని పోలీసులు అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని