శ్రీకాకుళంలో వలస కూలీల బస్సు బోల్తా

ప్రైవేటు బస్సు బోల్తా పడి 33 మంది గాయపడిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. మందస మండలం బాలిగాం వద్ద వలస కూలీలు వెళ్తున్న ట్రావెల్‌ ...

Updated : 13 Sep 2023 15:49 IST

శ్రీకాకుళం: ప్రైవేటు బస్సు బోల్తా పడి 33 మంది గాయపడిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. మందస మండలం బాలిగాం వద్ద వలస కూలీలు వెళ్తున్న ట్రావెల్‌ బస్సు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 33 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వలస కూలీలు కర్ణాటకలో క్వారంటైన్‌ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులంతా పశ్చిమ్‌ బంగా‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని