Published : 07/06/2020 00:58 IST

సిగరెట్లతో కాల్చి... మద్యం తాగించి..

మహిళపై సామూహిక అత్యాచారం

 

తిరువనంతపురం (కేరళ): కట్టుకున్న భార్యతో కిరాతకంగా ప్రవర్తించాడో భర్త. ఆమెతో బలవంతంగా మద్యం తాగించడమే కాకుండా శరీరంపై సిగరెట్లతో కాల్చి.. తన ఐదేళ్ల కుమారుడి ఎదుట నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తతోపాటు ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  కేరళలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... 
తిరువనంతపురానికి చెందిన 25 ఏళ్ల మహిళ, ఐదేళ్ల కుమారుడిని ఆమె భర్త గురువారం సాయంత్రం బీచ్‌కు తీసుకెళ్లాడు. అనంతరం తన స్నేహితుడి ఇంటికి అనిచెప్పి ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ తమ ఐదేళ్ల కుమారుడు చూస్తుండగానే మహిళతో బలవంతంగా మద్యం తాగించాడు. ఆపై నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని, అంతేకాకుండా బాధితురాలి శరీరాన్ని సిగరెట్లతో గాయపర్చాడని  పోలీసులు వెల్లడించారు. 
రోడ్డు పక్కన మద్యం మత్తులో, గాయాలతో పడి ఉన్న మహిళ తనను రక్షించమని అడిగినట్టు ఆ దారిన వెళ్తున్న ఓ యువకుడు తెలిపాడు. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి... జరిగిన ఘటనపై  పోలీసులకు సమాచారమిచ్చాడు. 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని