విజయవాడలో భారీ అగ్నిప్రమాదం

నగరంలోని బెంజిసర్కిల్‌ సమీపంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రిలయన్స్‌ దుకాణాల సముదాయంలోని మొదటి అంతస్తులో

Updated : 11 Jun 2020 12:20 IST

విజయవాడ : నగరంలోని బెంజిసర్కిల్‌ సమీపంలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రిలయన్స్‌ దుకాణాల సముదాయంలోని మొదటి అంతస్తులో ఉన్న రిలయన్స్‌ ఫుట్‌ ప్రింట్‌లో మంటలు చెలరేగాయి. ఆ సముదాయంలో వస్త్ర దుకాణం, కార్పొరేట్‌ కార్యాలయంతోపాటు ఇతర కార్యాలయాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అయిదు అగ్నిమాపక శకటాలతో రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో సుమారు 60 శాతానికిపైగా పాదరక్షలు మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. విద్యుదాఘాతమే ప్రమాదానికి కారణమై ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని