శ్రీశైలం ఆలయ అవినీతి.. 11 మంది సస్పెన్షన్‌

కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవినీతి వ్యవహారంలో బాధ్యులైన ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 11 మంది దేవస్థానం...

Published : 12 Jun 2020 01:00 IST

అమరావతి: కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవినీతి వ్యవహారంలో బాధ్యులైన ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 11 మంది దేవస్థానం ఉద్యోగులను సస్పెండ్ చేయాల్సిందిగా ఆలయ ఈవోను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరితో పాటు ఆలయంలో పనిచేసేందుకు డిప్యుటేషన్ పై వచ్చిన 20 మంది ఆంధ్రా బ్యాంకు, ఇతర ఏజెన్సీల ఉద్యోగులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. 2016 నుంచి 2020 మార్చి వరకు జరిగిన అవినీతికి సంబంధించి దాదాపు రూ. 2.56 కోట్లు దారిమళ్లినట్టు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో మొత్తం సొమ్మును రికవరీ చేయాలని.. బాధ్యులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని