Updated : 21 Jun 2020 01:20 IST

26/11 నిందితుడు తహవూర్‌ మరోసారి అరెస్ట్‌!

 

వాషింగ్టన్‌: 26/11 ముంబయి దాడుల నిందితుల్లో ఒకడైన తహవూర్‌ రాణాను అమెరికా పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు. పాకిస్థాన్‌ మూలాలున్న తహవూర్‌ రాణా 2008లో జరిగిన ముంబయి దాడులకు ఆర్థిక సాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఉగ్రమూకలకు సాయం చేశాడన్న ఆరోపణల కింద ఇప్పటికే షికాగో కోర్టు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే పది సంవత్సరాల శిక్ష పూర్తి చేసుకున్న అతడు.. ఆరోగ్యం క్షీణించడం, కరోనా వైరస్‌ వ్యాప్తి కారణాలతో వారం రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే, తహవూర్‌ను అ‍ప్పగించాలని భారత్‌ కోరడంతో జైలు నుంచి విడుదలైన రెండు రోజులకే లాస్‌ ఏంజిలస్‌ పోలీసులు తిరిగి అదుపులోకి తీసుకున్నారు. భారత్‌-అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అసిస్టెంట్‌ అటార్నీ జాన్‌ ఎల్‌ జూలెజియన్‌ పేర్కొన్నారు.

2008 నవంబర్‌ 26న దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్‌ హెడ్లీకి తహవూర్‌ అత్యంత సన్నిహితుడు. అలాగే, దాడులకు ముందు ముంబయిలో తుది రెక్కీ నిర్వహించింది కూడా తహవూరేనని విచారణలో భాగంగా హెడ్లీ గతంలోనే వెల్లడించాడు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని