
కత్తితో దాడి.. మంత్రి పేర్ని అనుచరుడి మృతి
మచిలీపట్నం: ఏపీ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్‌రావుపై హత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భాస్కర్‌రావు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందారు. దీంతో మంత్రి ఆస్పత్రి వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అసలేం జరిగింది?
ఈ రోజు ఉదయం 10.30 - 11గంటల సమయంలో వైకాపా నేత, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ భాస్కర్‌రావు చేపల మార్కెట్ వద్ద ఉండగా హత్యాయత్నం జరిగింది. ఓ యువకుడు కత్తితో పొడవడంతో ఆయన గుండె భాగంలో బలమైన గామైంది. దీంతో హుటాహుటిన ఆయన్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నిందితుడు మాత్రం అక్కడి నుంచి వేరే బైక్‌పై ఎక్కి వెళ్లిపోయినట్టు సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలుగురు నిందితులను పోలీసులు గుర్తించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పాత కక్షలే కారణమా?
2013లో జరిగిన ఒక హత్య కేసులో భాస్కర్‌రావు నిందితుడిగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఈ హత్యాయత్నానికి పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నట్టు సమాచారం. సీసీటీవీ ఫుటేజీలో కనబడిన ఇద్దరే కాకుండా ఇంకెవరైనా వారికి సాయం చేశారా?లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.