కరోనా నియంత్రణకు నిధుల పేరుతో మోసం

సైబర్‌ నేరగాళ్ల మోసాలు రోజురోజుకీ పెచ్చురేగిపోతున్నాయి. తాజాగా ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌ పేర్లతో రూ.9లక్షలు, గిఫ్ట్‌, ఓటీపీ, ఓఎల్ఎక్స్‌ పేర్లతో సైబర్‌ నేరగాళ్లు రూ.20లక్షలు కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

Published : 03 Jul 2020 01:03 IST

సైబర్‌ నేరగాళ్ల సరికొత్త పంథా

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్ల మోసాలు రోజురోజుకీ పెచ్చురేగిపోతున్నాయి. తాజాగా ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌ పేర్లతో రూ.9లక్షలు, గిఫ్ట్‌, ఓటీపీ, ఓఎల్ఎక్స్‌ పేర్లతో సైబర్‌ నేరగాళ్లు రూ.20లక్షలు కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కరోనా నియంత్రణకు నిధులు ఇస్తామని సైబర్‌ నేరగాళ్లు మోసానికి పాల్పడినట్టు బాధితులు వాపోయారు. యూకేలో మత బోధకుడినంటూ హైదరాబాద్‌కు చెందిన మహిళతో పరిచయం పెంచుకుని అనంతరం నేరగాళ్లు ఆమెతో వాట్సప్‌ ఛాటింగ్‌ చేశారని వెల్లడించారు. దిల్లీ విమానాశ్రయం నుంచి మాట్లాడుతున్నామని నగదు, బహుమతులు పంపుతున్నట్లు నమ్మబలికారని వివరించారు. మీకు డబ్బు వచ్చిందని కస్టమ్స్‌, ఐటీ, జీఎస్టీ కట్టాలని నేరగాళ్లు నమ్మించారని పేర్కొన్నారు. కస్టమ్స్‌, ఐటీ, జీఎస్టీ కట్టకపోతే క్రిమినల్‌ కేసు పెడతామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆన్‌లైన్‌ ద్వారా రూ.11లక్షలు బదిలీ చేసిన మహిళ వారి నుంచి  స్పందన లేకపోవడంతో మోసపోయినట్టు గుర్తించి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని