యజమాని ఇంటికే కన్నం

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నెలరోజులుగా తల్లిదండ్రులకు దూరంగా కాపురం పెట్టాడు. చివరికి జీవనోపాధి ఇబ్బందికరంగా మారడంతో దొంగగా మారి, యజమాని ఇంటికే కన్నం వేశాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో రూ.4 లక్షల విలువ చేసే 13.45 తులాల బంగారు ఆభరణాలు

Published : 11 Jul 2020 06:35 IST

నిందితుడి అరెస్టు

రూ.4 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం

సైదాబాద్‌, న్యూస్‌టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నెలరోజులుగా తల్లిదండ్రులకు దూరంగా కాపురం పెట్టాడు. చివరికి జీవనోపాధి ఇబ్బందికరంగా మారడంతో దొంగగా మారి, యజమాని ఇంటికే కన్నం వేశాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో రూ.4 లక్షల విలువ చేసే 13.45 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సైదాబాద్‌ సీఐ కస్తూరి శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. సైదాబాద్‌ డివిజన్‌ సాయిరాం కాలనీలో బజ్జూరి నితీష్‌గౌడ్‌(21) కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవాడు. ప్రేమ వివాహం చేసుకున్న ఇతను చంపాపేటలో గాంధీ విగ్రహం పరిసరాల్లో వేరే కాపురం పెట్టాడు. జీవనోపాధి కోసం ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తోడవ్వడంతో ఈనెల 7న తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చాడు. వారు అద్దెకు ఉండే ఇంటి యజమాని రవి చౌహాన్‌ కుటుంబ సభ్యులతో తిరుపతికి వెళ్లాడని తెలుసుకున్నాడు. అదేరోజు రాత్రి యాక్సాబ్లేడ్‌తో తాళం కోసి దొంగతనానికి పూనుకున్నాడు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఇంటి నిండా కారంపొడి చల్లాడు. ఈనెల 8న సమాచారం అందుకున్న రవి చౌహాన్‌ సోదరుడు వినోద్‌ చౌహాన్‌ సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న డీఎస్సై పి.మాధవరావు దర్యాప్తు చేపట్టారు. నితిష్‌గౌడ్‌పై సందేహంతో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసును పరిష్కరించిన తీరును హైదరాబాద్‌ నగర జాయింట్‌ కమిషనర్‌, తూర్పు పోలీస్‌ మండలం ఇన్‌ఛార్జి ఎం.రమేష్‌ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని