దుబే ఎన్‌కౌంట‌ర్‌పై రిటైర్డ్ జ‌డ్జీతో విచార‌ణ‌!

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దుబే పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించి ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రిపేందుకు యూపీ ప్ర‌భుత్వం స్వ‌తంత్ర ఏక‌స‌భ్య‌ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయ‌మూర్తి నేతృత్వం వ‌హించే ఈ క‌మిష‌న్ రెండు నెల‌ల్లోగా నివేదిక స‌మ‌ర్పించ‌నున్న‌ట్లు ఉత్త‌ర్ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

Published : 13 Jul 2020 00:57 IST

ల‌ఖ్‌న‌వూ: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దుబే పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించి ఎన్‌కౌంట‌ర్‌లో హతమైన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రిపేందుకు యూపీ ప్ర‌భుత్వం స్వ‌తంత్ర ఏక‌స‌భ్య‌ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయ‌మూర్తి నేతృత్వం వ‌హించే ఈ క‌మిష‌న్ రెండు నెల‌ల్లోగా నివేదిక స‌మ‌ర్పించ‌నున్న‌ట్లు యూపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

దీనికి ముందు, అత్యంత నేరచ‌రిత్ర క‌లిగిన దుబే ఆ స్థాయికి ఎద‌గ‌డానికి గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు జ‌రిపేందుకు ఇప్ప‌టికే ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని(సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఓ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారితోపాటు మ‌రో ఇద్ద‌రు పోలీసులు ఉండే ఈబృందం జులై 31నాటికి నివేదిక స‌మ‌ర్పించ‌నుంది. అయితే, దుబే మ‌ర‌ణానికి సంబంధించిన విష‌యాలను మాత్రం ఈ బృందం ప‌రిశీలించ‌ద‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన ఏక‌స‌భ్య క‌మిష‌న్ మాత్ర‌మే దుబే ఎన్‌కౌంట‌ర్‌పై విచార‌ణ చేప‌ట్ట‌నుంద‌ని తెలిపింది.

ఇదిలా ఉంటే, ఈ కిల్ల‌ర్ గ్యాంగ్‌స్ట‌ర్ ఈ స్థాయికి ఎద‌గ‌డానికి పోలీసుల పాత్ర కూడా ఉంద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. స్థానిక పోలీస్ స్టేష‌న్ ఇన్‌చార్జ్ అధికారితోపాటు మ‌రో న‌లుగురు సిబ్బందిని ఇప్ప‌టికే సస్పెండ్ చేశారు. మ‌రో 30మంది పోలీసు అధికారుల‌పై కూడా విచార‌ణ కొన‌సాగుతోంది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని