ఉద్యోగం దొరకట్లేదని.. ఉసురు తీసుకున్నాడు

కష్టపడి చదివి ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ప్రైవేటు ఉద్యోగం సంపాదించాడు. తరువాత దాన్ని వదిలేసి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశాడు. తాను ఖాళీగా ఇంటి వద్ద ఉంటుండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇది మానసిక కుంగుబాటుకు దారి తీసింది. కలుపు మందు తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు.

Published : 06 Aug 2020 00:43 IST

కలుపు మందు తాగిన యువకుడు ●

చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి

కష్టపడి చదివి ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ప్రైవేటు ఉద్యోగం సంపాదించాడు. తరువాత దాన్ని వదిలేసి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశాడు. తాను ఖాళీగా ఇంటి వద్ద ఉంటుండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇది మానసిక కుంగుబాటుకు దారి తీసింది. కలుపు మందు తాగి బలవన్మరణానికి ఒడిగట్టాడు.

బొద్దాం(రాజాం), న్యూస్‌టుడే: రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన బొమ్మన మధు (30) ఇంజినీరింగ్‌ వరకు చదివాడు. చేస్తున్న ఉద్యోగం వదిలేశాక..ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరక్క పోవటంతో ఈనెల మూడో తేదీన కలుపు నివారణ మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఎకాఎకిన జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. అంతే కళ్లెదుటే కొడుకు విగతజీవిగా కనబడటంతో తల్లిదండ్రులు మహేశ్వరి, కరుణాకర్‌రావు, సోదరి స్వాతి గుండెలవిసేలా రోదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని