Updated : 21/10/2020 08:44 IST

నాటి అనుబంధం.. నేటి హత్యకు కారణం..

మూడేళ్ల క్రితమే విజయవాడకు వచ్చిన సాకేత్‌రెడ్డి

విజయవాడ: కమిషనరేట్‌ ఉద్యోగి హత్య కేసులో నిందితుడు సాకేత్‌రెడ్డికి గతంలో విజయవాడతో అనుబంధం ఉంది. ఇదే మహేష్‌ హత్యకు కారణమైందా.? అంటే ప్రస్తుతం పోలీసులు వెల్లడించిన అంశాల ప్రకారం అవుననే అనాల్సి వస్తుంది. హైదరాబాద్‌లో ఉంటున్న సాకేత్‌రెడ్డి 2017లో విజయవాడకు వచ్చాడు. దాదాపు మూడు నెలల పాటు శాంతినగర్‌లో నివాసమున్నాడు. ప్రింటింగ్‌ ప్రెస్‌ ఏర్పాటు చేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వెళ్లిపోయాడు. ఆ సమయంలో విజయవాడలో ఆటో నడుపుతున్న ముదిరెడ్డి రాధాకృష్ణారెడ్డి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో తన మిత్రుడు సందీప్‌ కోరిక ప్రకారం విజయవాడకు వచ్చిన సాకేత్‌రెడ్డి, గంగాధర్‌లు తమతో పాటు తెలంగాణ మద్యాన్ని తెచ్చుకున్నారు. హత్య జరిగిన రోజు ఉదయం నుంచి వీరిద్దరూ పూటుగా మద్యం తాగారు. అదే సమయంలో పాత పరిచయమున్న ఆటో డ్రైవర్‌ను తమతో చేర్చుకున్నారు. వీరందరూ కలిసి ఈనెల 10వ తేదీ రాత్రి నున్న బైపాస్‌ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ మద్యం తాగుతుండగా పెట్రోలింగ్‌ పోలీసులు వచ్చి ఆటో డ్రైవర్‌ను హెచ్చరించారు. దీంతో రాధాకృష్ణారెడ్డి అక్కడి నుంచి ఆటో తీసుకుని వెళ్లిపోయాడు. అనంతరం మహేష్‌ను, అతని స్నేహితులను మందలించారు. అయితే మహేష్‌ తాను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తినని చెప్పడంతో త్వరగా కానిచ్చి వెళ్లండని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత తాగిన మైకంలో తనకు ఎలాంటి సంబంధం లేని విషయంలో తలదూర్చడమే కాకుండా.. అనవసరంగా మహేష్‌ను కాల్పి చంపాడని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని