ఇద్దరు చిన్నారులు సహా తల్లి ఆత్మహత్య

పదహారేళ్లకే పెళ్లయి, 21 ఏళ్లకు ఇద్దరు చిన్నారులకు తల్లి అయిన ఆ ఇల్లాలు అయిదేళ్లుగా కొనసాగుతున్న అవమానాలు, అదనపు కట్నం వేధింపులతో విసిగిపోయింది. పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో గురువారం ఈ విషాదం చోటుచేసుకుంది.

Updated : 20 Nov 2020 06:48 IST

 6 నెలల పసిగుడ్డు, మూడేళ్ల కుమార్తెతో చెరువులో దూకిన వివాహిత

బిజినేపల్లి : పదహారేళ్లకే పెళ్లయి, 21 ఏళ్లకు ఇద్దరు చిన్నారులకు తల్లి అయిన ఆ ఇల్లాలు అయిదేళ్లుగా కొనసాగుతున్న అవమానాలు, అదనపు కట్నం వేధింపులతో విసిగిపోయింది. పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో గురువారం ఈ విషాదం చోటుచేసుకుంది. వట్టెం గ్రామానికి చెందిన అమృతమ్మ(21)కు అయిదేళ్ల క్రితం తన కంటే వయసులో చాలా పెద్దవాడైన తిమ్మాజిపేట మండలం పుల్లగిరికి చెందిన భానూరి రాజుతో వివాహమైంది. వీరికి మూడేళ్లు, ఆరు నెలల వయస్సు కుమార్తెలు ఉన్నారు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే భర్త ఆమెను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. పలుమార్లు గ్రామపెద్దలు నచ్చజెప్పినా వేధింపులు ఆగలేదు. దీనికితోడు రెండో కాన్పు అనంతరం అమృతమ్మను తీసుకెళ్లడానికి నిరాకరించాడు. బుధవారం గ్రామపెద్దలు మరోమారు సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోయింది. తీవ్ర మనోవేదనకు గురైన అమృతమ్మ ఇద్దరు కుమార్తెలతో సహా వట్టెం సమీపంలోని రఘుపతి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని