Updated : 28/05/2021 07:12 IST

Crime: తాను వివాహమాడాల్సిన యువతిని పెళ్లి చేసుకున్నాడని..

వీడిన రైౖల్వే ఉద్యోగి హత్య కేసు మిస్టరీ

మల్కాజిగిరి, న్యూస్‌టుడే: మల్కాజిగిరి పీవీఎన్‌ కాలనీకి చెందిన రైల్వే ఉద్యోగి మద్ది విజయ్‌కుమార్‌ హత్య కేసులో గురువారం నిందితుణ్ని అరెస్టు చేశారు. తను పెళ్లి చేసుకోవాల్సిన యువతిని.. వివాహం చేసుకున్నాడన్న పగతో ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మల్కాజిగిరి ఏసీపీ శ్యాంసుందర్‌రావు, సీఐ జగదీశ్వరరావు వివరాల ప్రకారం.. మద్ది విజయ్‌కుమార్‌(30) రైల్వే వర్కుషాపు ఉద్యోగి. విశాఖపట్నానికి చెందిన భవ్యతో 2013లో వివాహమైంది. మే నెలలో విజయ్‌కుమార్‌ తల్లికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా భార్యను పుట్టింటికి పంపాడు. ఈనెల 8న ఉదయం విజయ్‌కుమార్‌.. తన సోదరితో వీడియోకాల్‌ మాట్లాడుతున్నాడు. గుర్తుతెలియని వ్యక్తి తలుపు నెట్టుకొని లోపలికి వచ్చి వేట కొడవలితో దాడి చేయడంతో విజయ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని సోదరి వెంటనే స్థానికులకు ఫోన్లో విషయం చెప్పింది. వారు వచ్చి చూసేసరికే చనిపోయాడు.
మూడు రోజుల పాటు రెక్కీ.. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫుటేజీలోని గుర్తుతెలియని వ్యక్తిని.. భవ్య బంధువు గుడ్డ శ్రీనివాస్‌రెడ్డి(30)గా గుర్తించారు. నిందితుడు డెహ్రాడూన్‌ ఆర్మీ రెజిమెంట్‌లో సిపాయిగా పని చేస్తున్నాడు. ఆమెను తొలుత అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని భావించినా, ఆ తర్వాత విజయ్‌కుమార్‌తో వివాహం చేశారు. అప్పటి నుంచి శ్రీనివాస్‌రెడ్డి విజయ్‌పై పగ పెంచుకున్నాడు. అతన్ని అంతమొదిస్తే భవ్య తిరిగి తన వద్దకే వస్తుందని భావించాడు. ఆమె వైజాగ్‌ వచ్చిన విషయం తెలుసుకున్నాడు. మే 5వ తేదీన వైజాగ్‌ నుంచి నగరానికి వచ్చాడు. మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించాడు. సికింద్రాబాద్‌లో వేట కొడవలి కొన్నాడు. మే 8వ తేదీ హత్య చేశాడు. ఎవరి కంటపడకుండా విశాఖకు వెళ్లిపోయాడు. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని