బాలికపై స్వామీజీ అత్యాచారయత్నం
స్వామీజీ అంటూ ప్రజలు ఆదరిస్తే.. వక్రబుద్ధిని చూపి ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం రాజూరలో చోటు చేసుకుంది. రాజూర
నేరడిగొండ, న్యూస్‌టుడే: స్వామీజీ అంటూ ప్రజలు ఆదరిస్తే.. వక్రబుద్ధిని చూపి ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం రాజూరలో చోటు చేసుకుంది. రాజూర సమీపంలో కొండపై శివాలయంలో ఏడేళ్ల నుంచి ఆత్మారాం మహరాజ్ అనే సాధువు నివాసం ఉంటున్నాడు.రెండేళ్లుగా సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలోని మరో ఆలయం పక్కన ఉంటున్నాడు. ఈ నెల 16న రాత్రి 8 గంటలకు సమీప గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక నీళ్లతో పాటు ప్రసాదాన్ని తీసుకెళ్లింది. సదరు బాలిక తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు మందిరం పక్కనే ఉండే నివాసానికి తలుపులు పెట్టి ఉండటాన్ని గమనించారు. అనుమానంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా బాలిక స్పృహ కోల్పోయి ఉంది. బాలిక ద్వారా అత్యాచారయత్నం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మంగళవారం మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొన్నట్లు ఎస్‌ఐ ఎస్‌ఐ భరత్ సుమన్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
Ts-top-news News
ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు
-
Sports News
సాకర్ బాటలో క్రికెట్!.. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్
-
Sports News
చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/06/23)
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!