TS Rythu Bheema: రైతుబీమా సొమ్ము కోసం.. వికారాబాద్‌ జిల్లాలో ఘరానా మోసం

రైతు బీమా కోసం జరిగిన ఓ ఘరానా మోసం వికారాబాద్‌ జిల్లాలో వెలుగు చూసింది.

Updated : 23 Jul 2021 12:37 IST

కుల్కచర్ల: రైతు బీమా కోసం జరిగిన ఓ ఘరానా మోసం వికారాబాద్‌ జిల్లాలో వెలుగు చూసింది. బీమా సొమ్ము కోసం మహిళ చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. ఈ ఘటన కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పుట్టాపహాడ్‌కు చెందిన చంద్రమ్మ (58) చనిపోయినట్లు ధ్రువపత్రాన్ని సృష్టించారు. ఆమె పేరున వచ్చిన రూ.5లక్షల బీమా సొమ్మును రైతుబంధు సమన్వయకర్త రాఘవేందర్‌రెడ్డి కాజేశారు. తమకు రైతుబంధు రావడం లేదంటూ చంద్రమ్మ కుమారుడు బాలయ్య అధికారులను కలవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. చంద్రమ్మ చనిపోయినట్లు తమకు ధ్రువపత్రం సమర్పించారని.. బీమా సొమ్ము కూడా తీసుకున్నారని అధికారులు ఆమె కుమారుడికి చెప్పారు. దీంతో బాలయ్య బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా రైతు బీమా డబ్బు వేరొక ఖాతాకు బదిలీ అయ్యాయని అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో రైతుబంధు సమన్వయకర్త రాఘవేందర్‌రెడ్డిపై బాలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై వ్యవసాయాధికారులు కూడా విచారణ చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని