Smuggling: దొడ్డిదారిన స్మగ్లింగ్‌.. మల రంధ్రంలో రూ.42 లక్షల బంగారం

ఇంఫాల్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్‌) రూ.42 లక్షల బంగారం స్వాధీనం చేసుకొంది..

Updated : 30 Sep 2021 01:21 IST

దిల్లీ: ఇంఫాల్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్‌) రూ.42 లక్షల బంగారం స్వాధీనం చేసుకొంది. జిగురు ముద్దగా నాలుగు ప్యాకెట్లలో ఉన్న ఈ బంగారు 909.7 గ్రాములు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీల సందర్భంగా నిందితుడి వైఖరి అనుమానాస్పదంగా ఉన్నట్లు సీఐఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.దిల్లి పసిగట్టారు. కేరళలోని కోజికోడ్‌కు చెందిన మహమ్మద్‌ షరీఫ్‌ అనే ఈ ప్రయాణికుడు ఇంఫాల్‌ నుంచి దిల్లీకి వెళుతూ పట్టుబడ్డాడు. వైద్యపరీక్షలకు తరలించి, దేహం కిందిభాగం మొత్తం ఎక్స్‌రే తీయగా మల రంధ్రంలో బంగారం దాచిన విషయం బయటపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని