
Cyber Crime: రూపాయితో రీఛార్జి అన్నారు.. రూ.11లక్షలు కొట్టేశారు!
నారాయణగూడ, న్యూస్‌టుడే: రూపాయితో రీఛార్జి చేసుకోవాలని.. లేకపోతే చరవాణి పని చేయదని చెప్పి రూ.11 లక్షలు కాజేశారంటూ ఓ వయోధికుడు సోమవారం హైదరాబాద్ సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఎస్సై లచ్చిరెడ్డి కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ వృద్ధుడు(70)కి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ఓ నెట్‌వర్క్ సంస్థ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. కొన్ని గంటల్లో మీ సిమ్‌కార్డు సేవలు రద్దవుతాయని.. వెంటనే రూపాయితో రీఛార్జి చేసుకోవాలని సూచించాడు. ఓ లింక్ పంపి వివరాలు పొందుపర్చాలన్నాడు. లింక్‌పై క్లిక్ చేసి, వివరాలన్నీ పొందుపరచగానే నెట్ బ్యాంకింగ్ ద్వారా వృద్ధుడి ఖాతాలోంచి విడతల వారీగా రూ.11 లక్షలు విత్‌డ్రా అయ్యాయి. నిస్సహాయ స్థితిలో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.